- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లావణ్య త్రిపాఠి 'సతీ లీలావతి' విడుదల తేదీ వచ్చేసింది
సతీ లీలావతి చిత్రాన్ని మే 8న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ నటి లావణ్య త్రిపాఠి ప్రస్తుతం సతీ లీలావతి అనే చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. దేవ్ మోహన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. భీమిలీ కబడ్డీ జట్టు, శివ మనసులో శృతి (SMS) వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందిన తాతినేని సత్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ బృందం విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని మే 8న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు మరియు ఒక టీజర్ విడుదల కాగా, అవి ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ నిర్మిస్తున్నారు. లావణ్య త్రిపాఠి చివరిసారిగా పెద్ద విజయాన్ని అందుకుని చాలా కాలం అయింది. మరి ఈ సతీ లీలావతి సినిమాతో ఆమెకు మంచి హిట్ దక్కుతుందేమో చూడాలి.






