- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లెనిన్ కోసం రెండు విడుదల తేదీలను టార్గెట్ చేసిన నాగ వంశీ
లెనిన్ చిత్రాన్ని జూన్ 26న విడుదల చేయకపోతే, జూలై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: అక్కినేని అఖిల్ ప్రస్తుతం 'లెనిన్' అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా కనిపించనుండగా, మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ విషయంలో ఇప్పటికే పలు మార్పులు చోటు చేసుకున్నాయి. మొదట ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే అదే సమయంలో “పెద్ది”ని ఏప్రిల్ 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించడంతో పోటీని దృష్టిలో పెట్టుకుని “లెనిన్” విడుదలను జూన్ 26కు వాయిదా వేశారు.
అయితే తాజా నివేదికల ప్రకారం “పెద్ది” సినిమాను జూన్ 25న విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో “లెనిన్” చిత్ర బృందం మరోసారి విడుదల తేదీని మార్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. లెనిన్ని ర్మాతల్లో ఒకరైన నాగ వంశీ, జూన్ 25కి సినిమా విడుదల కాకపోతే జులై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు విడుదలైన “లెనిన్” ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో, ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.






