- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పటి నుంచి మొదలుకానున్న ‘ఎల్లమ్మ’ రెగ్యులర్ షూట్
ఎల్లమ్మ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్ నెల నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ఎల్లమ్మ చిత్రం గురించి ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. అయితే హీరోయిన్ ఎంపిక పూర్తయ్యాకే షూటింగ్ ప్రారంభించాలని భావించిన మూవీ బృందం ఇంతకాలం వేచి చూసినట్లు సమాచారం. తాజాగా ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ మమతా బైజును హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌కు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్ నెల నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
తొలి షెడ్యూల్‌లో ప్రకాశ్ రాజ్‌తో పాటు మరికొంత మంది నటీనటులు పాల్గొననున్నారని సమాచారం. జూలై నెలలో దేవి శ్రీ ప్రసాద్, హీరోయిన్ షూటింగ్‌లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం దేవి శ్రీ ప్రసాద్ ఇప్పటికే ఓ థీమ్ మ్యూజిక్ కంపోజ్ చేసినట్లు, అది అద్భుతంగా వచ్చిందని టాక్ వినిపిస్తోంది. బలగం వేణు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించనుండగా, హీరోగా నటించడమే కాకుండా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కూడా అందించనున్నారు.






