పెద్ది ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ వేదిక ఖరారు

by Pulgam srinivas |

పెద్ది ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ను జూన్ 1న సాయంత్రం 5 గంటలకు విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

పెద్ది ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ వేదిక ఖరారు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం పెద్ది చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఎక్కువగా ఈ మూవీ బృందం తెలుగు రాష్ట్రాల కంటే ఇతర ప్రాంతాల్లోనే ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. దీంతో ఈ సినిమా పాన్ ఇండియా మార్కెట్‌పై మేకర్స్ ఎంతగానో దృష్టి పెట్టినట్లు స్పష్టమవుతోంది. ఇన్ని రోజులుగా ఇతర రాష్ట్రాల్లో ప్రమోషన్లు నిర్వహించిన చివరిగా తెలుగులో భారీ స్థాయిలో ఓ ఈవెంట్ నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించారు. అందులో భాగంగా విజయవాడలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేశారు.

ఈ సినిమా బృందం విజయవాడలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ను జూన్ 1వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఎవరు హాజరవుతారనే విషయంపై ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించగా, బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్ నిర్మించగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.




Next Story