- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రిలీజ్‌కు ముందే అలర్ట్ అయిన ‘పెద్ది’ టీమ్.. బుచ్చిబాబు బిజీకి ఇదే కారణమా?
‘పెద్ది’ ఫైనల్ కంటెంట్‌ను ఓవర్సీస్ మార్కెట్‌కు త్వరగా పంపించేందుకు మేకర్స్ షెడ్యూల్ రెడీ చేసినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాను జూన్ 4న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ‘పెద్ది’కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘పెద్ది’ ఫైనల్ కంటెంట్‌ను ఓవర్సీస్ మార్కెట్‌కు త్వరగా పంపించేందుకు మేకర్స్ షెడ్యూల్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో ఎలాంటి హడావిడి లేకుండా రిలీజ్ జరగాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇదే కారణంతో దర్శకుడు బుచ్చి బాబు సనా తాజాగా జరిగిన భోపాల్ ఈవెంట్‌కు కూడా అందుబాటులో లేరని ప్రచారం జరుగుతోంది. గతంలో పలు సినిమాలు ఓవర్సీస్ కంటెంట్ డెలివరీ విషయంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అలాంటి పరిణామాలు ఈ సినిమాకు ఎదురవకూడదని మూవీ బృందం చాలా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.






