‘పెద్ది’పై పోసాని షాకింగ్ కామెంట్స్

by Pulgam srinivas |

పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ.. ‘పెద్ది’ భారీ విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.

‘పెద్ది’పై పోసాని షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ కథా రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి తాజాగా ‘ఆపరేషన్ అరుణా రెడ్డి’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. అంతేకాకుండా ఈ సినిమాకు స్వయంగా దర్శకత్వం కూడా వహించారు. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో పోసాని ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు “మీ సినిమా విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ ‘పెద్ది’కి ముందో వెనుకో మీ సినిమా విడుదల కానుంది. మరి ‘పెద్ది’ గురించి మీరు ఏమంటారు?” అనే ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందించిన పోసాని, “‘పెద్ది’ సినిమా భారీ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకు ప్రధాన కారణం రామ్ చరణ్. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయనకు మంచి జరగాలి” అని అన్నారు.

అలాగే చరణ్ గురించి మాట్లాడుతూ, ‘నాయక్’ సినిమా సమయంలో జరిగిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘నాయక్’ మూవీ ద్వారా నాకు మంచి గుర్తింపు వచ్చింది. కొన్ని సన్నివేశాల్లో చరణ్‌ను డామినేట్ చేసే స్థాయిలో నాకు క్రేజ్ వచ్చింది. అయినప్పటికీ రామ్ చరణ్ ఎప్పుడూ దాన్ని పట్టించుకోలేదని చెప్పారు. ఒక రోజు చరణ్ నన్ను పిలిచి.. చిరంజీవి గారు సినిమా చూశారు. చాలా బాగుందని చెప్పారు. ముఖ్యంగా పోసాని గారి సన్నివేశాలు థియేటర్లలో బాగా పేలుతాయి. ఒక్క సీన్ కూడా ఎడిట్ చేయొద్దని చెప్పారు అని తెలిపారు. అంతలా నటుడిని గౌరవించే వ్యక్తి చరణ్. అందుకే ఆయన సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అంటూ పోసాని చెప్పుకొచ్చారు.

Next Story