The Paradise: ఆ ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్?

by Pulgam srinivas |   (  Updated:2026-04-25 04:46:21  IST  )

తాజా సమాచారం ప్రకారం 'ది ప్యారడైజ్'లో నాని–మోహన్ బాబు మధ్య వచ్చే సీన్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నాయని టాక్ వినిపిస్తోంది.

The Paradise: ఆ ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో భారీ అంచనాలు కలిగిన చిత్రాలలో నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ ఒకటి. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. కయాదు లోహర్ ఇందులో హీరోయిన్‌గా నటించనుండగా, మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాను ఆగస్టు నెలలో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.

ఇప్పటివరకు మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా నాని, మోహన్ బాబు గెటప్స్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. తాజా సమాచారం ప్రకారం నాని–మోహన్ బాబు మధ్య ఇప్పటికే చాలా కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. అవి అత్యంత అద్భుతంగా వచ్చాయని, థియేటర్లలో ఈ ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నాయని టాక్ వినిపిస్తోంది. ఇక ఇటీవల కాలంలో పెద్దగా విజయాలు అందుకోని మోహన్ బాబు ఈ సినిమాలో తన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటారని చిత్ర బృందం బలంగా నమ్ముతున్నట్లు సమాచారం.

శృతి హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ‘పెద్ది’కి కొత్త సమస్యలు.. టెన్షన్‌లో యూనిట్

Next Story