- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శృతి హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ‘పెద్ది’కి కొత్త సమస్యలు.. టెన్షన్‌లో యూనిట్
పెద్ది చిత్రంలో ఐటమ్ సాంగ్ కోసం శృతిహాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ, ఈ నెలలోనే షూటింగ్ పూర్తి చేయాలని కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన వార్తల్లో ఒకటి పెద్ది సినిమాకు సంబంధించిన ఐటమ్ సాంగ్. ఈ చిత్రానికి సంబంధించిన ప్రధాన షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని సమాచారం. ఇక ఒక ఐటమ్ సాంగ్ పూర్తయితే సినిమా మొత్తం షూటింగ్ కంప్లీట్ అయినట్లేనని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ స్పెషల్ సాంగ్ కోసం చిత్రబృందం పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలించినట్లు సమాచారం. చివరికి ప్రముఖ నటి శృతిహాసన్ ను ఈ ప్రత్యేక గీతం కోసం సంప్రదించగా, ఆమె సంతోషంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. శృతిహాసన్ ఓకే చెప్పడంతో సాంగ్ షూటింగ్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా పూర్తవుతుందని మొదట యూనిట్ భావించినప్పటికీ, అక్కడే అసలు టెన్షన్ ప్రారంభమైనట్లు సమాచారం.
ఈ స్పెషల్ సాంగ్‌లో నటించేందుకు ఆమె అంగీకరించినప్పటికీ, ఒక ముఖ్యమైన షరతు పెట్టినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో చాలా పనులు ఉన్న నేపథ్యంలో ఈ నెలలోనే సాంగ్ షూటింగ్ పూర్తిచేయాలని శృతిహాసన్ సూచించినట్లు సమాచారం. దీంతో చిత్రబృందం రాత్రింబవళ్లు శ్రమిస్తూ ఈ పాట కోసం భారీ సెట్ పనులను వేగంగా పూర్తి చేసే ప్రయత్నాల్లో నిమగ్నమైందని తెలుస్తోంది. మొత్తానికి శృతిహాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఆమె పెట్టిన షరతుతో ప్రస్తుతం ఈ స్పెషల్ సాంగ్‌ను ఈ నెలలోనే పూర్తి చేయడానికి మూవీ యూనిట్ తీవ్రంగా శ్రమిస్తున్నట్లు సమాచారం.






