- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెయిన్స్ అలర్ట్.. మరో గంటలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
మరోగంటలో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: మండుటెండల నుంచి భారీ వర్షాలు తెలంగాణ ప్రజలకు ఉపశమనాన్ని ఇస్తున్నాయి. రెండ్రోజులుగా పలు జిల్లాల్లో కురుస్తోన్న వర్షాలు రైతుల కళ్లల్లో ఆనందాన్ని నింపాయి. తాజాగా వర్షాలపై తెలంగాణ వెదర్ మ్యాన్ మరో అప్డేట్ ఇచ్చారు. మరో గంటలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
భద్రాచలం కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, ఖమ్మం, మంచిర్యాల, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, వనపర్తి, హైదరాబాద్ జిల్లాల్లో రానున్న 24 గంటల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాతావరణశాఖ వెల్లడించింది. వర్షాల నేపథ్యంలో రైతులు తమ పంటలను కాపాడుకోవాలని, వర్షాల సమయంలో చెట్లు, హోర్డింగులు, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడవద్దని కోరింది.






