రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేళ అందరి కళ్లు అతనిపైనే అంటూ స్పెషల్ పోస్టర్ షేర్ చేసిన మూవీ టీమ్..

by Gugulothu.Kavitha |   (  Updated:2025-12-27 08:43:17  IST  )

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా మారుతి(Maruti) దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘ది రాజా సాబ్’(The Raja Saab) విడుదలకు సిద్ధంగా ఉంది.

రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేళ అందరి కళ్లు అతనిపైనే అంటూ స్పెషల్ పోస్టర్ షేర్ చేసిన మూవీ టీమ్..
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా మారుతి(Maruti) దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘ది రాజా సాబ్’(The Raja Saab) విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్(Nidhi Agarwal), మాళవిక మోహనన్(Malavika Mohanan), రిద్ధి కుమార్(Riddhi Kumar) హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్(Thaman) సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను పూర్తి హారర్ కామెడీ జోనర్‌లో రూపొందించారు మేకర్స్.

దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ అయింది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. అయితే ఈ మూవీ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ది రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లోని ఖైతలపూర్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో తాజాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ తాజాగా ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘అన్ని కళ్లు.. అన్నీ హృదయాలు.. ఒక మ్యాన్ కోసం వేచి చూస్తున్నాయి.. ది రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి స్టార్ట్ కానుంది’ అని రాసుకొచ్చింది. ఇక పోస్టర్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హ్యాండ్ సమ్ లుక్‌లో కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Read Similar News : ‘ది రాజా సాబ్’ నుంచి భైరవి పోస్టర్ రిలీజ్.. మాస్ లుక్‌లో కట్టిపడేస్తున్న హీరోయిన్

Next Story