- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ది రాజా సాబ్’ నుంచి భైరవి పోస్టర్ రిలీజ్.. మాస్ లుక్‌లో కట్టిపడేస్తున్న హీరోయిన్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘ది రాజా సాబ్’(The Raja Saab) విడుదలకు సిద్ధంగా ఉంది.

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా మారుతి(Maruti) దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘ది రాజా సాబ్’(The Raja Saab) విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్(Nidhi Agarwal), మాళవిక మోహనన్(Malavika Mohanan), రిద్ధి కుమార్(Riddhi Kumar) హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్(Thaman) సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను పూర్తి హారర్ కామెడీ జోనర్‌లో రూపొందించారు మేకర్స్.
దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ అయింది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. అయితే ఈ మూవీ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈక్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి హీరోయిన్ మాళవిక మోహనన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు.
‘ది రాజా సాబ్ ప్రపంచం నుండి భైరవిగా అందమైన మాళవికని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము.. జనవరి 9, 2026 నుండి ప్రపంచవ్యాప్తంగా సినిమా హాళ్లలో ఈ సినిమా విడుదల కానుంది’ అని రాసుకొచ్చారు. ఇక పోస్టర్ చూసినట్లయితే మాళవిక పలచని బ్లాక్ శారీలో నడుము కనిపించేలా రైట్ హ్యాండ్‌తో నల్లటి కళ్లద్దాలను కొంచెం కిందకి చేస్తూ లెఫ్ట్ హ్యాండ్‌లో బ్లాక్ హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని మాస్ లుక్‌లో దర్శనమిచ్చింది. ఫైనల్‌గా మాళవిక భైరవి రోల్‌లో చించేయనున్నట్లు పోస్టర్‌ను చూస్తే తెలుస్తోంది.






