అక్కడ షూటింగ్ జరుపుకుంటున్న ‘ఆదర్శ కుటుంబం’ మూవీ.. వీడియో వైరల్

by Gugulothu.Kavitha |   (  Updated:2026-01-29 11:58:47  IST  )

టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ కాంబినేషన్‌లో వెంకటేష్(Venkatesh), త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas)ది ఒకటి.

అక్కడ షూటింగ్ జరుపుకుంటున్న ‘ఆదర్శ కుటుంబం’ మూవీ.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ కాంబినేషన్‌లో వెంకటేష్(Venkatesh), త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas)ది ఒకటి. వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆద‌ర్శ కుటుంబం’(Adarsha Kutumbam). అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. అంతేకాకుండా ఆదర్శ కుటుంబం సినిమాను జెట్ స్పీడ్ లో ఫినిష్ చేయాలని దర్శకుడు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట. అది కూడా మే వరకు కంప్లీట్ చేయాలని పక్కా ప్లాన్ వేసుకున్నాడట. అందుకు తగ్గట్టుగానే షూటింగ్ ను ఉరకలెత్తిస్తున్నాడట.

అలాగే, సమ్మర్ లోనే సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లోని జెబిఎస్ ప్రసాద్ గ్రౌండ్ మెట్రో స్టేషన్‌లో అయినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఇక ఈ మూవీలో వెంకీ చాలా స్టైలీష్‌గా కనిపించనున్నట్లు వీడియో చూస్తే తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా వెంకీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వెంకీ-అనిల్ రావిపూడి సినిమాలో పుష్ప విల‌న్ ?

Next Story