వెంకీ-అనిల్ రావిపూడి సినిమాలో పుష్ప విల‌న్ ?

by velandi.Saikiran |

సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో గత ఏడాది విక్టరీ వెంకటేష్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం.

వెంకీ-అనిల్ రావిపూడి సినిమాలో పుష్ప విల‌న్ ?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి వరుస సినిమాలతో దూసుకు వెళ్తున్నారు. ప్రతి సంక్రాంతికి ఒక హిట్ కొడుతున్న అనిల్ రావిపూడి, మొన్న మెగాస్టార్ చిరంజీవితో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. మన శంకర వరప్రసాద్ గారు సినిమాను చాలా గ్రాండ్ గా తెర‌కెక్కించిన‌ అనిల్ రావిపూడి, ట్రెండింగ్ లోకి వచ్చారు. గత సంక్రాంతికి విక్టరీ వెంకటేష్ తో హిట్ కొట్టి, ఈ సారి మెగాస్టార్ చిరంజీవి ద్వారా సక్సెస్ అందుకున్నారు. ఆయన విజయాన్ని అందుకోవడమే కాకుండా ఆ మెగాస్టార్ చిరంజీవికి కూడా చరిత్రలో మరిచిపోలేని హిట్ అందించారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు, అనిల్ రావిపూడితో సినిమా చేసేందుకు ఎగబడుతున్నారట.

వెంకీ మామతో అనిల్ సినిమా

సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో గత ఏడాది విక్టరీ వెంకటేష్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం. అయితే ఈ మూవీకి సీక్వెల్ కూడా తీస్తున్నారు అనిల్ రావిపూడి. 2027 సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారట. అయితే ఇందులో ఒక గెస్ట్ రోల్ ఉంటుందని అంటున్నారు. దీనికోసం ముందు రానా దగ్గుబాటి పేరు వినిపించినప్పటికీ, ఇప్పుడు మరో ఇద్దరి పేర్లు తెరపైకి వచ్చింది. తమిళ్ హీరో కార్తీ లేదా పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ ను తీసుకునే ఛాన్సులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఫహాద్ ఫాజిల్ ను ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నట్లు టాలీవుడ్ సర్కిల్లో వార్తలు వస్తున్నాయి.

Next Story