- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుటుంబంతో కలిసి 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా చూసిన మెగాస్టార్
ఉస్తాద్ భగత్ సింగ్' ప్రత్యేక షోకు చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా మరియు మరికొంతమంది విచ్చేశారు.

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం మార్చ్ 19న విడుదలైంది. ఈ చిత్రానికి పరవాలేదు అనే స్థాయి టాక్ దక్కినప్పటికీ, ప్రస్తుతం ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాను మూవీ బృందంతో కలిసి మెగాస్టార్ చిరంజీవి మరియు ఆయన సతీమణి సురేఖ ప్రత్యేక షోలో వీక్షించారు. మూవీ మేకర్స్ ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక ప్రదర్శనకు పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవా, ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీలీల, దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాతలు నవీన్, రవి, దర్శకుడు అనిల్ రావిపూడి తదితర సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. సినిమా చూస్తున్న సమయంలో సెలబ్రిటీలు ఇచ్చిన రియాక్షన్స్‌ను క్యాప్చర్ చేసి మూవీ మేకర్స్ ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.
ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. దీంతో మొదటి నుంచే ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి టోటల్ రన్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం ఎన్ని వసూళ్లు సాధించి ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, తమన్ నేపథ్య సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రంలో రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు.






