పెళ్లి ఫిక్స్ అయ్యింది.. ఫ్రీడమ్ పోయింది

by Chukka Sudharani |   (  Updated:2026-05-07 15:36:54  IST  )

‘పెళ్లి ఫిక్స్ అయ్యింది.. ఫ్రీడమ్ మిస్ అయ్యింది.. పెళ్లి తర్వాత అబ్బాయిల జీవితం ఫుల్ టైమ్ కామెడీ అవుతుంది..

పెళ్లి ఫిక్స్ అయ్యింది.. ఫ్రీడమ్ పోయింది
X

దిశ, సినిమా: పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా, కమెడియన్ సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పురుషః’. వైష్ణవి కొక్కుక, విషిక, హాసిని సధీర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన ప్రతీ అప్డేట్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. తాజాగా రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. భార్యల కాళ్ల కింద నలిగిపోతున్న భర్తల జీవితాలు అనే యాంగిల్‌లో పోస్టర్ షేర్ చేస్తూ.. ‘పెళ్లి ఫిక్స్ అయ్యింది.. ఫ్రీడమ్ మిస్ అయ్యింది.. పెళ్లి తర్వాత అబ్బాయిల జీవితం ఫుల్ టైమ్ కామెడీ అవుతుంది.. పురుషః మే 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నది’ అంటూ చెప్పుకొచ్చారు. వీరు వులవల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తలు కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు.

Read more..హాట్ లుక్‌తో హీట్ పెంచేసిన నయని పావని.. బీచ్‌లో మత్తెక్కించే పోజులు

Next Story