ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిన ది లెజెండ్ శరవణన్ ‘లీడర్’.. ఆ తేదీనే స్ట్రీమింగ్!

by Pulgam srinivas |   (  Updated:2026-05-27 06:27:09  IST  )

ప్రముఖ వ్యాపారవేత్త 'లెజెండ్' శరవణన్ ప్రధాన పాత్రలో నటించిన 'లీడర్' చిత్రం మే 29వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిన ది లెజెండ్ శరవణన్ ‘లీడర్’.. ఆ తేదీనే స్ట్రీమింగ్!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ వ్యాపారవేత్త 'లెజెండ్' శరవణన్ తాజాగా లీడర్ అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. ఆర్.ఎస్. దురై సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. స్పై యాక్షన్ మరియు తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ అంశాలతో ప్రేక్షకులం ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా ఏప్రిల్ 3వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.

ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను అమెజాన్ సంస్థ కొనుగోలు చేసింది. అందులో భాగంగా ఈ చిత్రాన్ని మే 29వ తేది నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇక ఓటీటీ ప్రేక్షకులను ఈ చిత్రం ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి. పాయల్ రాజ్‌పుత్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించగా శ్యామ్, ఆండ్రియా జెరెమియా, సంతోష్ ప్రతాప్, లాల్, బాహుబలి ప్రభాకర్, అమృత అయ్యర్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. జిబ్రాన్ సంగీత సారధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను లెజెండ్ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ వారు నిర్మించారు.

10 ఏళ్ల తర్వాత ఫైనల్‌గా సెట్ అయిన రామ్ - అనిల్ రావిపూడి కాంబో!

Next Story