- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
10 ఏళ్ల తర్వాత ఫైనల్‌గా సెట్ అయిన రామ్ - అనిల్ రావిపూడి కాంబో!
రామ్ పోతినేని - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో త్వరలోనే ఓ సినిమా పట్టాలెక్కనున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హిట్ మిషన్ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘రాజా ది గ్రేట్’ చిత్రాన్ని మొదటగా రామ్ పోతినేనితో చేయాలని భావించారట. అందులో భాగంగా రామ్‌కు కథను కూడా వినిపించినట్లు సమాచారం. అయితే అప్పటికే వరుసగా మాస్ సినిమాలు చేస్తుండడంతో, కొంత రిలీఫ్ కావాలనే ఉద్దేశంతో ఆ సమయంలో ఈ ప్రాజెక్ట్ చేయలేనని రామ్ చెప్పినట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఆ తర్వాత ఈ కథతో రవితేజ హీరోగా ‘రాజా ది గ్రేట్’ తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి అనిల్ రావిపూడి – రామ్ పోతినేని కాంబోలో సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక దాదాపు పదేళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ సెట్స్‌పైకి వెళ్లబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అనిల్ రావిపూడి, వెంకటేష్ మరియు కళ్యాణ్ రామ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. మరోవైపు రామ్ కూడా తన తదుపరి సినిమాపై పూర్తి దృష్టి పెట్టాడు. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాక అనిల్ రావిపూడి – రామ్ పోతినేని కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అంతేకాకుండా ఈ చిత్రాన్ని 2027 దసరా సందర్భంగా విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కాంబో నిజంగా సెట్ అయితే సినిమాపై నెక్స్ట్ లెవెల్ అంచనాలు ఏర్పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






