- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినిమా మొత్తం నన్ను ఆ పని చేయనివ్వలేదు.. భూమిక షాకింగ్ కామెంట్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), అలనాటి క్రేజీ హీరోయిన్ భూమిక(Bhumika) జంటగా నటించిన ‘ఖుషి’(Khushi) సినిమా అప్పట్లో ఎంతటి విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), అలనాటి క్రేజీ హీరోయిన్ భూమిక(Bhumika) జంటగా నటించిన ‘ఖుషి’(Khushi) సినిమా అప్పట్లో ఎంతటి విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఎస్ జే సూర్య(SJ Surya) దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 2001లో విడుదలై అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. పవన్ కళ్యాణ్, భూమికలకు తిరుగులేని ఇమేజ్‌ని తెచ్చిపెట్టింది. ఇప్పటికీ ఆ మూవీ అంటే యూత్ ఎంతో ఇష్టంగా చూస్తూ ఉంటారు. ఇక సాంగ్స్ అయితే ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్ లిస్ట్‌లో ఉంటుంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను హీరోయిన్ భూమిక షేర్ చేసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భూమిక మాట్లాడుతూ.. ‘నేను ‘ఖుషి’ సినిమాకి మేకప్ వేసుకోలేదు. సినిమాలో 80 శాతం మేకప్ లేకుండానే కనిపిస్తాను. దియా సీన్‌లో కొంత మేకప్ టచ్ ఇచ్చాను. కానీ పీసీ శ్రీరామ్(కెమెరామెన్) సర్ ఫేస్ వాష్ చేసుకొని రమ్మని చెప్పాడు. దీంతో అది నన్ను కొంత అప్‌సెట్‌కి గురి చేసింది’ అని తెలిపింది భూమిక. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.






