- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇన్నేళ్లకు ఆ పని చేసే ఛాన్స్ వచ్చింది.. స్రవంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
‘కలర్ ఫోటో’(Colour Photo) సినిమాతో హీరోగా పరిచయమైన టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్(Suhas) ప్రస్తుతం నటిస్తున్న తాజా సినిమా ‘హే భగవాన్’(Hey Bhagavan).

దిశ, వెబ్‌డెస్క్: ‘కలర్ ఫోటో’(Colour Photo) సినిమాతో హీరోగా పరిచయమైన టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్(Suhas) ప్రస్తుతం నటిస్తున్న తాజా సినిమా ‘హే భగవాన్’(Hey Bhagavan). గోపి అచ్చర(Gopi Achara) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివాని నాగరం(Shivani Nagaram) హీరోయిన్‌గా నటిస్తోంది. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి. నరేంద్ర రెడ్డి(Narendra Reddy) నిర్మిస్తున్న ఈ మూవీకు వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చారు.
వెన్నెల కిషోర్, సుదర్శన్, అన్నపూర్ణమ్మ, యాంకర్ స్రవంతి వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 20, 2026న విడుదల కానుంది. అయితే తాజాగా రిలీజ్ చేసిన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నది. ఈ క్రమంలో యాంకర్, బిగ్ బాస్ బ్యూటీ స్రవంతి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
ఆమె మాట్లాడుతూ.. ‘నా పేరు స్రవంతి చొక్కారపు.. మాది అనంతపురం జిల్లాలోని కదిరి విలేజ్.. ఇది నా ఫస్ట్ స్పీచ్ కాబట్టి నా డీటైల్స్ చెబుతున్నాను. అయితే 2009లో నేను ఇక్కడికి యాక్ట్రెస్ అవ్వాలనే ఆశతో వచ్చాను. ‘హేయ్ భగవాన్’ సినిమాతోనే లాంచ్ అవ్వాలని ఆ భగవంతుడే రాసిపెట్టాడేమో. పవన్ కళ్యాణ్ గారి డివోటీగా ఆయన్నే ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని, 16 - 17 ఏళ్ల పాటు ఎక్కడా గివ్ అప్ ఇవ్వకుండా ఇక్కడ నిలబడేలా చేసుకున్నాను’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.






