- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డైలాగులు లేకుండా నటించడమే అతి పెద్ద సవాల్: Rukmini Vasanth
రుక్మిణి సినిమా రంగం, మోడలింగ్ మధ్య ఉన్న తేడా గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినిమాల్లో పంచ్ డైలాగులు చెప్పడం, యాక్షన్ సీక్వెన్స్‌లలో నటించడం వంటివి కొంతవరకు మేనేజ్ చేయవచ్చని ఆమె అభిప్రాయపడింది.

దిశ, సినిమా: కన్నడ యంగ్ బ్యూటీ రుక్మిణి వసంత్ ఇప్పుడు సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ‘సప్తసాగరాలు దాటి’ అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి తన సహజమైన నటనతో అనతికాలంలోనే భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ‘కాంతార’ సినిమా సక్సెస్‌తో ఈమె క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. ప్రస్తుతం రుక్మిిణి చేతిలో వరుసగా స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి. ఈక్రమంలో.. తాజాగా రుక్మిణి సినిమా రంగం, మోడలింగ్ మధ్య ఉన్న తేడా గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినిమాల్లో పంచ్ డైలాగులు చెప్పడం, యాక్షన్ సీక్వెన్స్‌లలో నటించడం వంటివి కొంతవరకు మేనేజ్ చేయవచ్చని ఆమె అభిప్రాయపడింది. కథా నేపథ్యం, సంభాషణలు నటనకు తోడ్పడతాయని తెలిపింది.
కానీ మోడలింగ్ రంగం అలా కాదని, అక్కడ ఒక్క మాట కూడా మాట్లాడకుండా.. భావాలను, అభినయాన్ని పండించాల్సి ఉంటుందని చెప్పింది. ఏమీ మాట్లాడకుండా కెమెరా ముందు భావాలను పండించడమే ఒక మోడల్‌కు అతిపెద్ద సవాల్ అని ఆమె పేర్కొంది. సినిమా రంగంలో తానూ ప్రస్తుతం ఇదే విషయాన్ని నేర్చుకుంటున్నానని రుక్మిణి వెల్లడించింది. కేవలం డైలాగుల మీద ఆధారపడకుండా, తన అభినయంతో ప్రేక్షకులను ఎలా మెప్పించాలో ప్రాక్టీస్ చేస్తున్నానని ఆమె చెప్పిన తీరును నెటిజన్లు అభినందిస్తున్నారు… కాగా.. రుక్మిణి వసంత్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ అమ్మడు కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. దీనితో పాటు, తెలుగులో మోస్ట్ అవేటెడ్ ఫిలిం అయిన ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో రూపొందుతున్నాయి.
మూర్ఖత్వంతో కూడిన నిర్ణయాల వల్ల 17 ఏళ్ల జీవితం వృధా అయింది: Meera Vasudevan






