- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూర్ఖత్వంతో కూడిన నిర్ణయాల వల్ల 17 ఏళ్ల జీవితం వృధా అయింది: Meera Vasudevan
ఆ సమయంలో నేను నా జీవితంలో ఇంకా ఎంతో సాధించి ఉండేదాన్ని. నా తల్లిదండ్రులు, సోదరితో విలువైన సమయాన్ని గడపాల్సింది పోయి, ఇతరుల కోసం ఆ కాలాన్ని వృధా చేశాను.

దిశ, సినిమా: నటి మీరా వాసుదేవన్ తెలుగులో 'గోల్కొండ హైస్కూల్' వంటి చిత్రాలతో పాటు మలయాళం, తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె సినిమాల్లో ,సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో భాగంగా తన వ్యక్తిగత జీవితం, గతంలో తాను తీసుకున్న నిర్ణయాలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. తన జీవితంలోని అత్యంత విలువైన 17 ఏళ్ల సమయం మూర్ఖత్వంతో కూడిన నిర్ణయాల వల్ల వృధా అయిందని ఆమె ఎమోషనల్ అయ్యారు. గతంలో తాను తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల మానసికంగా ఎంతో కుంగిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. "ఆ సమయంలో నేను నా జీవితంలో ఇంకా ఎంతో సాధించి ఉండేదాన్ని. నా తల్లిదండ్రులు, సోదరితో విలువైన సమయాన్ని గడపాల్సింది పోయి, ఇతరుల కోసం ఆ కాలాన్ని వృధా చేశాను.
నన్ను ఏమాత్రం గౌరవించని, నన్ను సీరియస్‌గా తీసుకోని వ్యక్తుల కోసం, వారి సంబంధాల కోసం తాపత్రయపడి నా జీవితాన్ని పాడుచేసుకున్నాను" అని ఆమె పేర్కొన్నారు. ఆ 17 ఏళ్ల కాలం తన జీవితంలో ఒక పెద్ద పాఠం మిగిల్చిందని ఆమె తెలిపారు. తన గత చేదు జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, జీవితంలో సమయం, సరైన వ్యక్తుల ఎంపిక ఎంత ముఖ్యమో ఆమె చెప్పిన మాటలు నెటిజన్లను ఆలోచింపజేస్తున్నాయి. కాగా.. 2005లో విశాల్ అగర్వాల్‌ను వివాహం చేసుకున్నారు. అయితే మనస్పర్థల కారణంగా 2010లో వారు విడాకులు తీసుకున్నారు.ఆ తర్వాత 2012లో నటుడు జాన్ కొక్కెన్‌ను వివాహం చేసుకోగా.. వీరికి ఒక కుమారుడు జన్మించాడు. కానీ ఈ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు, 2016లో ఈ జంట విడిపోయింది. ఆ తర్వాత జరిగిన మరో వివాహం కూడా సఫలం కాలేదని సమాచారం.
ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు.. టాలీవుడ్ హీరోలపై భాగ్యశ్రీ బోర్సే ఇంట్రెస్టింగ్ కామెంట్స్






