ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు.. టాలీవుడ్ హీరోలపై భాగ్యశ్రీ బోర్సే ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

మాస్ మహారాజా నుంచి సహనం, షూటింగ్ సెట్స్‌లో ఆయన చూపించే అంతులేని ఎనర్జీని చూసి ఆశ్చర్యపోయా.

ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు.. టాలీవుడ్ హీరోలపై భాగ్యశ్రీ బోర్సే ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ అండ్ సెన్సేషనల్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం వరుస అవకాశాలతో ఇండస్ట్రీలో క్రేజీ బ్యూటీగా మారింది. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ, ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన గ్లామర్, నటనతో దర్శకనిర్మాతలను మెస్మరైజ్ చేస్తోంది. విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్ హీరోలతో నటించిన సరైన హిట్ అందుకోలేకపోయింది.అయినప్పటికీ వరుస అవకాశాలు దక్కించుకుంటోంది.ప్రస్తుతం స్టార్ హీరో శివకార్తీకేయన్ సరసన ‘సెయాన్’ చిత్రంతో తమిళ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెడుతోంది. అలాగే అక్కినేని అఖిల్ సరసన ‘లెనిన్’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. దీనిని జూన్ 26న విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భాగ్యశ్రీ తాను పని చేసిన ప్రతి హీరో నుంచి ఏదో ఒక విషయాన్ని నేర్చుకున్నానని తెలిపింది. ‘‘మాస్ మహారాజా నుంచి సహనం, షూటింగ్ సెట్స్‌లో ఆయన చూపించే అంతులేని ఎనర్జీని చూసి ఆశ్చర్యపోయా. ఇక విజయ్ దేవరకొండకు సినిమాపై ఉన్న ప్యాషన్, ప్రతి సీన్‌ను పర్ఫెక్ట్‌గా చేయాలనే ఆయన తపన నను ఎంతగానో ప్రభావితం చేశాయి. రామ్ కేవలం స్టార్ హీరో మాత్రమే కాదు, అద్భుతమైన డ్యాన్సర్. ప్రతి షాట్ కోసం ఆయన పెట్టే డెడికేషన్ నుంచి చాలా విషయాలు గ్రహించాను. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఇక దుల్కర్ సల్మాన్ ఇప్పటికే సీనియర్ నటుడైనప్పటికీ, ప్రతి సన్నివేశాన్ని ఒక కొత్త నటుడిలా ఆసక్తిగా గమనించడం ఆయన గొప్పతనం’’ అని ప్రశంసలు కురిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story