‘రెబల్’ అందుకే ఫ్లాప్ అయింది.. లారెన్స్ చేసిన మిస్టేక్ అదే.. షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రముఖ రైటర్

by Pulgam srinivas |   (  Updated:2026-05-24 06:02:00  IST  )

రైటర్ డార్లింగ్ స్వామి మాట్లాడుతూ.. “లారెన్స్ ‘రెబల్’ సినిమా కథ కంటే కూడా ప్రభాస్‌ను అందంగా, స్టైలిష్‌గా చూపించాలనే విషయంపైనే ఎక్కువ ఆసక్తి పెట్టారు. అందుకే సినిమా ఫలితం అలా వచ్చి ఉండొచ్చు” అని చెప్పుకొచ్చారు.

‘రెబల్’ అందుకే ఫ్లాప్ అయింది.. లారెన్స్ చేసిన మిస్టేక్ అదే.. షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రముఖ రైటర్
X

దిశ, వెబ్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘రెబల్’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమాలో తమన్నా, దీక్షా సేథ్ హీరోయిన్లుగా నటించగా, రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. తాజాగా ప్రముఖ రైటర్ డార్లింగ్ స్వామి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడానికి గల కారణాలను వివరించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “ప్రభాస్ హీరో కావడం, అలాగే ‘కాంచన’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ‘రెబల్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అలాగే లారెన్స్ ‘రెబల్’ సినిమా కథపై కంటే కూడా ప్రభాస్‌ను ఎంత స్టైలిష్‌గా చూపించాలి, ప్రతి సీన్ ఎంత అందంగా ఉండాలి అన్న దానిపై ఎక్కువ దృష్టి పెట్టారు. యాక్షన్ బ్లాక్స్ కూడా అద్భుతంగా ఉండాలని భావించి, వాటిని అదే స్థాయిలో డిజైన్ చేసి తెరపై చూపించారు. అయితే సినిమాను స్టైలిష్‌గా చూపించాలనే ప్రయత్నంలో కథ కాస్త పక్కకు వెళ్లింది. అదే ఈ సినిమా ఫెయిల్యూర్‌కు ఒక ప్రధాన కారణంగా మారింది. అయినప్పటికీ ప్రభాస్ అత్యంత స్టైలిష్‌గా కనిపించిన చిత్రాల్లో ‘రెబల్’కు ఇప్పటికీ మంచి స్థానం ఉంటుందని డార్లింగ్ స్వామి చెప్పుకొచ్చారు.

విజయ్ సరసన ప్రీతి ముకుందన్

Next Story