- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయ్ సరసన ప్రీతి ముకుందన్
‘రౌడీ జనార్ధన’ చిత్రంలో ప్రీతి ముకుందన్ స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘రణబాలి’ చిత్రంతో పాటు, రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రౌడీ జనార్ధన’ సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా కనిపించనుండగా, దిల్ రాజు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం దర్శకుడు రవి కిరణ్ కోలా ఓ ప్రత్యేకమైన సిచువేషన్‌ను రూపొందించినట్లు సమాచారం. ఈ పాట కోసం ‘కన్నప్ప’ ఫేమ్ ప్రీతి ముకుందన్ ను తీసుకోవాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ప్రీతి ముకుందన్‌తో చర్చలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ‘రౌడీ జనార్ధన’ చిత్రంలోని స్పెషల్ సాంగ్‌లో ఆమె కనిపించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఈ చిత్రంలో సీనియర్ నటుడు రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయన పాత్ర వైవిధ్యంగా ఉండటమే కాకుండా, లుక్ పరంగా కూడా చాలా భిన్నంగా ఉండనున్నట్లు సమాచారం.






