మా అన్నయ్య రామ్ చరణ్ అందుకే 'రాకాస' చూడలేదు… నిహారిక వ్యాఖ్యలు వైరల్

by Pulgam srinivas |   (  Updated:2026-04-02 13:13:56  IST  )

నిహారిక మాట్లాడుతూ... "మా అన్నయ్య రామ్ చరణ్ కొన్ని రోజుల క్రితం తగిలిన గాయంతో బాధపడుతున్నాడు. అందుకే ప్రస్తుతానికి సినిమా చూడలేదని" సమాధానం ఇచ్చింది.

మా అన్నయ్య రామ్ చరణ్ అందుకే రాకాస చూడలేదు… నిహారిక వ్యాఖ్యలు వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై చిత్రాలను నిర్మిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ బ్యానర్‌లో పలు చిత్రాలను నిర్మించిన నిహారిక, 'కమిటీ కుర్రాళ్లు'తో మంచి సక్సెస్‌ను అందుకొని నిర్మాతగా గుర్తింపును సంపాదించుకుంది. తాజాగా ఈమె సంగీత్ శోభన్ హీరోగా, నయన్ సారిక హీరోయిన్‌గా, మానస శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'రాకాస' చిత్రాన్ని నిర్మించింది. ఈ మూవీని రేపు విడుదల చేయనున్నారు. దాంతో ఈ నిర్మాత పెద్ద ఎత్తున ప్రచారాలను నిర్వహిస్తోంది.

తాజాగా ఈమె పాత్రికేయులతో ముచ్చటించింది. అందులో భాగంగా ఈమెకు రామ్ చరణ్ గారు 'రాకాస' చిత్రం చూశారా? అనే ప్రశ్న ఎదురైంది. దానికి నిహారిక స్పందిస్తూ... మా అన్నయ్య రామ్ చరణ్‌కు కొన్ని రోజుల క్రితమే షూటింగ్ చేస్తున్న సమయంలో గాయం తగిలింది. ఆయన ఇప్పుడు ఆ దెబ్బతో బాధపడుతున్నారు. ఇలాంటి సమయంలో సినిమా చూడమని చెప్పడం కరెక్ట్ కాదు. కానీ చరణ్ అన్నయ్య కచ్చితంగా నా సినిమా చూస్తాడు అని సమాధానం ఇచ్చింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రామ్ చరణ్ కూడా ఈ మూవీ బృందంతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Rakasa Movie : రాకాస’ డైరెక్టర్ మానస శర్మ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా?

Next Story