Divorce case: దళపతి విజయ్‌కు భార్య సంగీతా నుంచి కొత్త లీగల్ షాక్!

by Ramesh Naini |   (  Updated:2026-03-07 10:56:49  IST  )

ప్రముఖ కోలీవుడ్ నటుడు, టీవీకే (తమిళగ వెట్రి కళగం) పార్టీ అధినేత విజయ్‌కు ఆయన సతీమణి సంగీత మరో లీగల్ షాక్ ఇచ్చారు.

Divorce case: దళపతి విజయ్‌కు భార్య సంగీతా నుంచి కొత్త లీగల్ షాక్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ కోలీవుడ్ నటుడు, టీవీకే (తమిళగ వెట్రి కళగం) పార్టీ అధినేత విజయ్‌కు ఆయన సతీమణి సంగీత మరో కొత్త లీగల్ షాక్ ఇచ్చారు. తమ విడాకుల వ్యవహారం కొలిక్కి వచ్చే వరకు.. చెన్నై నీలాంగరైలో ఉన్న విజయ్ సొంతింట్లోనే నివాసం ఉండేందుకు తనకు అనుమతివ్వాలని కోరుతూ చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో ఆమె శనివారం మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు.

లాయర్ ద్వారా బెదిరిస్తున్నారు..

తాను లండన్‌కు చెందిన వ్యక్తినని, చెన్నైలో తనకు వేరే నివాసం లేనందున నీలాంగరై ఇంట్లో ఉండేందుకు తనకు పూర్తి హక్కు ఉందని సంగీత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, ఆ ఇంట్లో ఉండేందుకు అనుమతి కోరిన తనను విజయ్ తన న్యాయవాదుల ద్వారా బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆమె కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సినిమాల ద్వారా కోట్లాది రూపాయలు గడించిన విజయ్ ఆస్తుల నుంచి.. తనకు, తమ ఇద్దరు పిల్లలకు (ఒక కుమారుడు, కుమార్తె) న్యాయబద్ధంగా దక్కాల్సిన వాటాను ఇప్పించాలని ఆమె కోరారు. అలాగే, పరస్పర అంగీకారంతో విడిపోవడానికి విజయ్ అంగీకరించలేదని సంగీత తెలిపారు.

ఆ నటి పేరు బయటపెడతా..

2021లో ఓ ప్రముఖ నటితో విజయ్‌కు వివాహేతర సంబంధం ఏర్పడిందని, ఆమెతో బంధాన్ని తెంచుకుంటానని తనకు ఇచ్చిన హామీని విజయ్ నిలబెట్టుకోలేదని ఆరోపిస్తూ సంగీత ఫిబ్రవరి 24న విడాకుల పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. విజయ్ తీరు తనకు, తన పిల్లలకు తీవ్ర అవమానకరంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనను మరింత ఒత్తిడికి గురిచేస్తే, సదరు నటి పేరును బహిర్గతం చేస్తానని సైతం సంగీత హెచ్చరించారు. ప్రస్తుతం వీరిద్దరూ విడివిడిగానే జీవిస్తున్నారు.

ఏప్రిల్ 20న విచారణ..

భార్యాభర్తల బంధానికి ద్రోహం చేశారంటూ సంగీత వేసిన విడాకుల పిటిషన్ ఏప్రిల్ 20న విచారణకు రానుంది. ఆ రోజున తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం ఇప్పటికే విజయ్‌కు నోటీసులు జారీ చేసింది. తాజాగా సంగీత వేసిన ఈ మధ్యంతర పిటిషన్‌తో ఈ వ్యవహారం కోలీవుడ్, తమిళ రాజకీయ వర్గాల్లో మరింత సంచలనంగా మారింది.

రాజకీయాల్లోకి నటి త్రిష.. హీరో విజయ్ టీవీకే పార్టీలో చేరిక..?

Next Story