- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హిందీ ఇండస్ట్రీ కంటే తెలుగు వాళ్లే గ్రేట్.. సోనాలి బింద్రే సెన్సేషనల్ కామెంట్స్
సోనాలి బింద్రే టాలీవుడ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

దిశ, సినిమా: ఒకప్పటి స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘మురారి’, మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఇంద్ర’, కింగ్ నాగార్జున సరసన ‘మన్మథుడు’ వంటి ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించి టాలీవుడ్‌లో ఫుల్ ఫేమ్ దక్కించుకున్నారు. ఆ తర్వాత పలు కారణాల వల్ల బాలీవుడ్‌కే పరిమితమైన ఆమె, మధ్యలో క్యాన్సర్ బారిన పడటంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు. ప్రస్తుతం క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకుని మళ్లీ ఇండస్ట్రీలో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సోనాలి బింద్రే టాలీవుడ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. తాను తెలుగు సినిమాల్లో నటించే రోజుల్లో టాలీవుడ్ షూటింగ్ సెట్స్ చాలా పద్ధతిగా, ఆర్టిస్ట్‌లకు ఎంతో అనుకూలంగా ఉండేవని సోనాలి గుర్తు చేసుకున్నారు.
హిందీ ఇండస్ట్రీతో పోలిస్తే తెలుగు ఇండస్ట్రీ వాళ్లు కథ, స్క్రిప్ట్ విషయంలో ఎంతో పక్కాగా ప్లాన్ చేసుకుని రెడీగా పెట్టుకునేవారని చెప్పారు. కానీ బాలీవుడ్‌లో కొన్ని సినిమాలకైతే షూటింగ్ స్పాట్‌కు వెళ్లిన తర్వాత కూడా అక్కడికక్కడే సీన్లు రాస్తూ ఉండేవారని, అది తనకు కొంచెం ఇబ్బందిగా అనిపించేదని ఆమె అసలు నిజాన్ని బయటపెట్టారు. తెలుగు సినిమాలు మేకింగ్ పరంగా చాలా పెద్దవని, వాటి బడ్జెట్, షూటింగ్ ప్లానింగ్ చూస్తే హిందీ సినిమాలు కూడా వాటితో సరితూగవని సోనాలి ప్రశంసించారు. అప్పట్లోనే షూటింగ్స్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీ, అన్నపూర్ణ స్టూడియోలతో పాటు విదేశాలలోనూ భారీగా షెడ్యూల్స్ ప్లాన్ చేసేవారని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. హిందీ ఇండస్ట్రీ కంటే తెలుగు వాళ్లే గ్రేట్ అని ఈ సందర్భంగా చెప్పారు. వీటన్నింటితో పాటు తెలుగు షూటింగ్ సెట్స్‌లో పెట్టే రకరకాల టిఫిన్స్, రుచికరమైన భోజనం అంటే తనకు చాలా ఇష్టమని సోనాలి పేర్కొన్నారు.
ఆమె నాలో ఎంతో భావోద్వేగాన్ని కలిగించింది.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ఐశ్వర్య లక్ష్మి






