- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆమె నాలో ఎంతో భావోద్వేగాన్ని కలిగించింది.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ఐశ్వర్య లక్ష్మి
మేము ప్రతిరోజూ షూటింగ్ సెట్‌కు వెళ్ళినప్పుడు, సినిమాలో ప్రేక్షకులకు ఎలాంటి లోటూ కనిపించకూడదనే ఉద్దేశంతో మా అత్యుత్తమ నటనను అందించాలని ఎప్పుడూ ఆరాటపడుతుంటాము

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘గట్టకుస్తీ-2’ బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ‘గట్టకుస్తీ’ సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రంలో విష్ణు విశాల్, ఐశ్వర్యలక్ష్మి జంటగా నటించి మెప్పించారు. భారీ వసూళ్లతో విజయవంతంగా దూసుకుపోతోంది. పాజిటివ్ టాక్‌తో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ మార్కును దాటేసి నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. దర్శకుడు చెల్లా అయ్యావు ఈ సినిమాలో కూతురి పెంపకం, కుటుంబ బాధ్యతలు, కెరీర్ ఆంబిషన్స్ మధ్య భార్యభర్తల మధ్య వచ్చే విభదాలు వంటి అంశాలను ఫన్నీ అండ్ ఎమోషన్స్‌తో చూపించి ప్రేక్షకులను మైమరిపించారు. థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న నేపథ్యంలో, తాజాగా చిత్రబృందం ఒక థాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి స్టేజ్ పైనే ఎమోషనల్ అయి కన్నీరు పెట్టుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. "మేము ప్రతిరోజూ షూటింగ్ సెట్‌కు వెళ్ళినప్పుడు, సినిమాలో ప్రేక్షకులకు ఎలాంటి లోటూ కనిపించకూడదనే ఉద్దేశంతో మా అత్యుత్తమ నటనను అందించాలని ఎప్పుడూ ఆరాటపడుతుంటాము.
కానీ, ఇలాంటి ఒక అద్భుతమైన విజయం చాలా అరుదుగా మాత్రమే దక్కుతుంది. సినిమా విడుదలైన ఐదవ రోజే మనం ఇంత పెద్ద సక్సెస్‌ను జరుపుకుంటున్నామంటే ఇప్పటికీ నాకు నమ్మశక్యంగా లేదు" అని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన సారాకు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. "సారాకు థాంక్స్. నాలో ఇలాంటి భావోద్వేగాలు కలుగుతాయని నేను అస్సలు ఊహించలేదు. ఆమె నటన నాలో ఎంతో ఎమోషన్‌ను కలిగించింది. అందుకే నాకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయి" అని చెబుతూ ఐశ్వర్య లక్ష్మి భావోద్వేగంతో తన స్పీచ్ ముగించారు. ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మి కన్నీరు పెట్టుకున్న ఈ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆమె నటనను మెచ్చుకుంటూ సినిమా టీమ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.






