- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమన్నా భాటియా- సిద్ధార్థ్ మాల్హోత్రా ‘ది వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్..
సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా, సిద్ధార్థ్ మల్హోత్రా కలయికలో రాబోతున్న లేటెస్ట్ క్రేజీ మూవీ ‘ది వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ ’. సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒక వైవిధ్యభరితమైన నేచురల్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రముఖ దర్శకుడు దీపక్ కుమార్ మిశ్రా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ బాలాజీ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు ఏక్తా కపూర్, శోభా కపూర్ ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇందులో ఏదో సరికొత్త పాయింట్ ఉండబోతోందనే ఆసక్తిని అందరిలోనూ రేకెత్తించాయి.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకుంటున్న ఈచిత్రం.. ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ ప్రేక్షకుల్లో హైప్‌ను మరింతగా పెంచేసింది. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో పాటు చిత్రయూనిట్ విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడుఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎంతో పవర్‌ఫుల్‌గా ఉన్న ఈ పోస్టర్‌లో.. ఒకవైపు పులి, మరొకవైపు ఆవు ఉండగా, వాటి మధ్యలో ఒక వ్యక్తి చేతిలో త్రిశూలం పట్టుకుని నిలబడి ఉన్న భయంకరమైన లుక్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమా ప్రకృతికి, మనుషులకు మధ్య జరిగే ఏదో ఒక విలక్షణమైన పోరాటంలా ఉండబోతోందని అర్థమవుతోంది.






