అడ ప్రాజెక్టు పై ప్రభుత్వానికి ఎందుకు ఇంత నిర్లక్ష్యం : ఎంపీ గొడం నగేష్

by Batti.Sumithra |

కొమురం భీం అడ ప్రాజెక్టు మరమ్మతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇంత నిర్లక్ష్యమోనని ఎంపీ గొడం నగేష్ ప్రశ్నించారు.

అడ ప్రాజెక్టు పై ప్రభుత్వానికి ఎందుకు ఇంత నిర్లక్ష్యం : ఎంపీ గొడం నగేష్
X

దిశ, ఆసిఫాబాద్ : కొమురం భీం అడ ప్రాజెక్టు మరమ్మతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇంత నిర్లక్ష్యమోనని ఎంపీ గొడం నగేష్ ప్రశ్నించారు. గురువారం సాయంత్రం వాంకిడి కస్తూర్బా విద్యాలయంలో కొనసాగుతున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడారు. మూడేళ్ల క్రితం భారీ వర్షాల కారణంగా అడ ప్రాజెక్టు ఆనకట్ట దెబ్బతిన్నప్పటికీ, నేటి వరకు మరమ్మతులు చేయకుండా కేవలం కవర్లతో కప్పి తాత్కాలిక రక్షణ కల్పించడం దారుణమన్నారు. 2009–10లో కాంగ్రెస్ హయాంలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మించకుండానే రూ.17 వేల కోట్లు ఖర్చు చేసి కాలువలు ఏర్పాటు చేసి వృథాగా వదిలేశారని ఎద్దేవా చేశారు. అడ ప్రాజెక్టు నిర్మాణం పూర్తై ఏళ్లు గడుస్తున్నా అక్కడ పూర్తిస్థాయిలో కాలువల నిర్మాణం చేపట్టకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ప్రమాదంలో ఉందని ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అడ ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.

Next Story