- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీజీఎల్‌ఐ పాలసీదారులు వివరాలు అప్‌డేట్ చేయాలి: ప్రభుత్వ జీవిత బీమా శాఖ
తెలంగాణ ప్రభుత్వ జీవిత బీమా పాలసీలున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ వివరాలను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని బీమా శాఖ సంచాలకులు వి.శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వ జీవిత బీమా పాలసీలున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ వివరాలను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని బీమా శాఖ సంచాలకులు వి.శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 56 సంవత్సరాల లోపు వయస్సు ఉండి, జీతభత్యాల నుంచి నెలవారీ బీమా ప్రీమియంలు చెల్లిస్తున్నా.. కొందరు ఉద్యోగులు సంబంధిత జిల్లా బీమా కార్యాలయాలలో ప్రతిపాదన పత్రాలు సమర్పించలేదని, దానివల్ల వారు పాలసీలు పొందలేకపోయారని ఆయన తెలిపారు.
అలాంటి వారు అన్ని రకాల బీమా ప్రయోజనాలకు అనర్హులవుతారని స్పష్టం చేశారు. ఉద్యోగులు, డీడీవోలు చొరవ తీసుకుని, ప్రతిపాదన పత్రాలను పూర్తి చేసి జిల్లా బీమా కార్యాలయాల్లో సమర్పించి పాలసీలను పొందాలని సూచించారు. ఆ పాలసీ నంబర్లను ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లోని ఉద్యోగుల మాస్టర్ జాబితాలో అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు. వివరాలు నమోదు చేయకపోతే ఉద్యోగుల నెలసరి ప్రీమియం మొత్తాలు సస్పెన్స్ అకౌంట్లలోకి వెళ్లే అవకాశం ఉంటుందని, ఫలితంగా బీమా ప్రయోజనాలకు అనర్హులవుతారని స్పష్టం చేశారు.






