తిరుమలలో మరోసారి భారీ పాము దర్శనం.. భయపడిపోయిన భక్తులు

by Ajay Maddhiboyina |

తిరుమలలో మరోసారి భారీ పాము కలకలం రేపింది. నారాయణగిరి ఉద్యానవన షెడ్ ప్రాంతంలో 9 అడుగుల పొడవు ఉన్న జెర్రిపోతు పాము దర్శనం ఇచ్చింది. పామును చూసిన భక్తులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

తిరుమలలో మరోసారి భారీ పాము దర్శనం.. భయపడిపోయిన భక్తులు
X

దిశ‌, వెబ్ డెస్క్: తిరుమలలో మరోసారి భారీ పాము కలకలం రేపింది. నారాయణగిరి ఉద్యానవన షెడ్ ప్రాంతంలో 9 అడుగుల పొడవు ఉన్న జెర్రిపోతు పాము దర్శనం ఇచ్చింది. పామును చూసిన భక్తులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. టీటీడీ అధికారులకు సమాచారం అందడంతో వెంటనే స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయకుడుకు సమాచారం ఇచ్చారు. ఆయన ఘటనాస్థలానికి చేరుకుని పట్టుకునే ప్రయత్నం చేయగా అది కాలికి చుట్టుకుంది. అయినప్పటికీ ఆయన ఎంతో చాకచక్యంగా వ్యవహరించి పామును విడిచిపెట్టకుండా బంధించారు.

తరవాత ఆ పామును సమీపంలోని అటవీప్రాంతంలో విడిచిపెట్టడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. తిరుమల క్షేత్రం శేషాచలం అటవీప్రాంతం మధ్యలో ఉండటం వల్ల వన్యప్రాణులు వస్తుంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇటీవల సైతం తిరుమల కొండపై ఓ భారీ నాగుపాము భక్తులకు కనిపించగా భాస్కర్ నాయుడే వచ్చి దానిని పట్టుకుని అడవిలో వదిలేశారు. ఇది జరిగిన కొద్దిరోజుల్లోనే మరోసారి భారీ పాము భక్తులను భయాందోళనకు గురిచేసింది.

Next Story