- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nissan India: మార్కెట్లో నిస్సాన్ ‘టెక్టాన్’ ఎంట్రీ
బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమవగా, జూలై 20 నుంచి డెలివరీలు అందించనున్నట్టు కంపెనీ తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ ఇండియా దేశీయ మార్కెట్లో కొత్త ఎస్‌యూవీని విడుదల చేసింది. మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తన ఉనికిని బలోపేతం చేయడానికి కంపెనీ కొత్త 'టెక్టాన్' ఎస్‌యూవీని విడుదల చేసింది. రూ.10.49 లక్షల (ఎక్స్‌షోరూమ్) ప్రారంభ ధరతో వచ్చిన ఈ మోడల్ ప్రస్తుతం కంపెనీ లైనప్‌లోనే అత్యంత ప్రీమియం ఎస్‌యూవీగా నిలిచింది. బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమవగా, జూలై 20 నుంచి డెలివరీలు అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. డిజైన్ పరంగా టెక్టాన్ బోల్డ్ ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, సీ-ఆకారపు డీఆర్ఎల్, 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, మస్కులర్ బాడీ డిజైన్‌తో తెచ్చినట్టు నిస్సాన్ ఇండియా వివరించింది.
ఈ కారు ప్రీమియం ఎస్‌యూవీల స్థాయిలో 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, గూగుల్ బిల్ట్-ఇన్, వైర్‌లెస్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయెల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పానరోమిక్ సన్‌రూఫ్, పవర్డ్ టెయిల్‌గేట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత విషయంలో 5-స్టార్ బీఎన్‌క్యాప్ రేటింగ్, 6 ఎయిర్‌బ్యాగ్స్, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అలాగే అడాస్ ఫీచర్లు అందించింది. 1.0-లీటర్ (100 హెచ్‌పీ), 1.3-లీటర్ టర్బో పెట్రోల్ (163 హెచ్‌పీ) ఇంజిన్ ఆప్షన్లు ఉండగా, 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. మైలేజీ లీటర్‌కు 18.5 నుంచి 19.4 కి.మీ వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ మోడల్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్, టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్, హోండా ఎలివేట్, టాటా సియెర్రా, రెనాల్ట్ డస్టర్ వంటి ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది.






