- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లిఫ్ట్ మరమ్మత్తులు చేస్తుండగా విద్యుదాఘాతం.. యువకుడు మృతి
నిజామాబాద్ నగర శివారులోని బోర్గం (పీ) గ్రామ పరిధిలో ఓ అపార్ట్‌మెంట్ వద్ద లిఫ్ట్ మరమ్మత్తులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందాడు.

దిశ, నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ నగర శివారులోని బోర్గం (పీ) గ్రామ పరిధిలో ఓ అపార్ట్‌మెంట్ వద్ద లిఫ్ట్ మరమ్మత్తులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణ శివారులోని భూమ్ రెడ్డి కన్వెన్షన్‌కు చెందిన కమర్షియల్ కాంప్లెక్స్‌లో గురువారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నిర్వాహకులు ఓ గుత్తేదారుకు పనిని అప్పగించగా, ఆయన ఇద్దరు కూలీలను తీసుకువచ్చాడు. లిఫ్ట్ మరమ్మత్తులు జరుగుతుండగా 33/11 కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో కిరణ్ (30) అనే యువకుడు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. దీపక్ అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. హుటాహుటిన క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు నాలుగో టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






