- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిట్యాల రైల్వే స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
by Batti.Sumithra |
చిట్యాల పట్టణ కేంద్రంలోని రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించినట్లు పోలీసులు తెలిపారు.

X
దిశ, చిట్యాల : చిట్యాల పట్టణ కేంద్రంలోని రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించినట్లు పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం, స్థానిక రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో సుమారు 40 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడు తెలుపు, నలుపు రంగుల కలయికతో ఉన్న చెక్స్ షర్ట్, బ్లూ కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడు. మృతుని కుడి చేతిపై అశోక చక్రం పచ్చబొట్టు, ఒక చేతి ముద్ర పచ్చబొట్టు ఉండగా, కుడి చేతి పిడికిలి పై కూడా పచ్చబొట్టు ఉంది. మృతుడు ఫిట్స్ వల్ల లేదా ఇతర ఆరోగ్యపరమైన సమస్య కారణంగా మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుని వివరాలు తెలిసిన వ్యక్తులు 8712670187 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఎస్‌ఐ రవికుమార్ కోరారు.
Next Story






