పీర్జాదిగూడలో బాల కార్మికుడి గుర్తింపు

by velandi.Saikiran |

మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పీర్జాదిగూడలో బాల కార్మికుడిని పనిలో పెట్టుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.

పీర్జాదిగూడలో బాల కార్మికుడి గుర్తింపు
X

దిశ, మేడిపల్లి: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పీర్జాదిగూడలో బాల కార్మికుడిని పనిలో పెట్టుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఆపరేషన్ స్మైల్ బృందం నిర్వహించిన తనిఖీల్లో 13 సంవత్సరాల 6 నెలల వయస్సు గల బాలుడు ఇటుక బట్టీలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం, బిహార్ రాష్ట్రానికి చెందిన ప్రీతమ్ కుమార్ అనే బాలుడు పీర్జాదిగూడలోని ఎస్‌బీ బ్రిక్స్‌లో పని చేస్తున్నట్లు గుర్తించారు. విచారణలో ఇటుక బట్టీ యజమాని బకారం అరుణ్ మహేష్ బాలుడిని పనిలో పెట్టుకుని బాల కార్మికత్వాన్ని ప్రోత్సహించినట్లు తేలింది. దీంతో సంబంధిత చట్టాల కింద మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని, ఇటువంటి ఘటనలు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Next Story