- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్రమత్తంగా వ్యవహరించాలి .. నిర్లక్ష్యానికి తావు ఉండకూదదు : మహేష్ కుమార్ గౌడ్
పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ లు ఎస్ఐఆర్ పైన గురువారం జూమ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్ఐఆర్ పనితీరుపైన నేతలను అడిగి తెలుసుకున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ లు ఎస్ఐఆర్ పైన గురువారం జూమ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్ఐఆర్ పనితీరుపైన నేతలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఎంపీలు, పార్లమెంట్ ఇంచార్జ్‌లు, ఎస్ఐఆర్ పార్లమెంట్ కోఆర్డినేటర్లు, అసెంబ్లీ కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమం, బూత్ స్థాయి ఏర్పాట్లు, బీఎల్ఏల పనితీరుపై పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో జూమ్ సమీక్ష సమావేశంలో వివరాలు సేకరించారు.
సమావేశంలో ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలోని పని తీరును క్షుణ్ణంగా మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ లు సమీక్షించారు. బూత్‌ల వారీగా జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ, బీఎల్ఏల పనితీరు, ఓటర్ల జాబితా పరిశీలన, అవసరమైన పత్రాల సేకరణ, అర్హత కలిగిన ప్రతి ఓటు పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై వివరాలు వారు తెలుసుకున్నారు. పనితీరు మెరుగుపర్చాల్సిన ప్రాంతాలపై సంబంధిత ఇంచార్జ్‌లకు దిశానిర్దేశం చేశారు. బూత్ స్థాయిలో సమన్వయం మరింత బలోపేతం చేయాలని, ప్రతి బీఎల్ఏ పూర్తి బాధ్యతతో పనిచేయాలని సూచించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, అర్హులైన వారి ఓటు రక్షణే ప్రధాన లక్ష్యమని టీపీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ లు స్పష్టం చేశారు.






