- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
24న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమైన 'కాగితం పడవలు'
బ్యూటిఫుల్ లవ్ స్టొరీ 'కాగితం పడవలు' జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

దిశ, కామారెడ్డి : బ్యూటిఫుల్ లవ్ స్టొరీ 'కాగితం పడవలు' జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది. వర్ధన్, కృష్ణప్రియ హీరో హీరోయిన్లుగా ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కీర్తన నరేష్, టీ. ఆర్. ప్రసాద్ రెడ్డి వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప నిర్మించారు.
గ్లింప్స్, ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్..
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. స్వచ్ఛమైన ప్రేమకథతో పాటు యూత్ కు నచ్చే అంశాలతో సినిమా ఉండటంతో సోషల్ మీడియాలోనూ మంచి టాక్ నడుస్తోంది.
ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ విడుదల..
తెలుగు చిత్రపరిశ్రమలో ప్రతిష్టాత్మక పంపిణీ సంస్థల్లో ఒకటైన ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ 'కాగితం పడవలు' ను విడుదల చేయడం విశేషం. ఒక సినిమా కంటెంట్ పై బలమైన నమ్మకం ఉన్నప్పుడే ఇలాంటి పెద్ద సంస్థలు ముందుకు వస్తాయి. దీంతో ఈ చిత్రం పై ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి.
టెక్నికల్ టీం..
ఈ చిత్రానికి ఐఏఎస్ నౌఫల్ రాజా సంగీతం అందించారు. రుద్రసాయి డీవోపీగా, జెస్విన్ ప్రభు ఎడిటర్ గా పనిచేశారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఎం.హిమ బిందు, కాస్ట్యూమ్స్ కిరణ్, సాహిత్యం రెహమాన్, పీఆర్వో తేజస్వి సజ్జా బాధ్యతలు నిర్వర్తించారు.
జిల్లా వాసులు ఆదరించాలి..
కామారెడ్డి జిల్లా పిట్లంకు చెందిన దర్శకుడు ఎంజీఆర్ తుకారాం ఎంతో కష్టపడి ఈ సినిమాను రూపొందించారు. సొంత జిల్లా బిడ్డ తెరకెక్కించిన సినిమా కావడంతో జిల్లా వాసులంతా థియేటర్లకు వెళ్లి 'కాగితం పడవలు' ను ఆదరించాలని చిత్ర బృందం కోరుతోంది.
24న కామారెడ్డిలో రిలీజ్..
కాగితం పడవలు సినిమా ఈనెల 24న కామారెడ్డి జిల్లా కేంద్రంలో గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. ఇందుకోసం నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
నటీనటులు : వర్ధన్, కృష్ణప్రియ
రచన & దర్శకత్వం : ఎంజీఆర్ తుకారాం
నిర్మాతలు : కీర్తన నరేష్, T. R. ప్రసాద్ రెడ్డి వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప
సంగీతం : AIS.నౌఫల్ రాజా
డీవోపీ : రుద్రసాయి
ఎడిటర్ : జెస్విన్ ప్రభు






