- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యే మందుల సామేల్‌కు వ్యతిరేకం కాదు: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న వివాదాలు, జరుగుతున్న పరిణామాలపై భువనగిరి ఎంపీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి రియాక్ట్ అయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో : తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న వివాదాలు, జరుగుతున్న పరిణామాలపై భువనగిరి ఎంపీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. తాను ఎమ్మెల్యే మందుల సామేల్ కు వ్యతిరేకం కాదని, తాను తుంగతుర్తి నియోజకవర్గంలో మండల అధ్యక్ష పదవికి, పీఏసీఎస్ చైర్మన్ పదవికి, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ప్రమోట్ చేయలేదన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్యకర్తల అభిప్రాయం మేరకు ఎవరిని కోరుకుంటే వారికే పదవులు ఇద్దామని మందుల సామేల్ తో చెప్పానని, ఆయన తీసుకునే నిర్ణయానికి తాను వ్యతిరేకం కాదని ఎంపీ చామల స్పష్టం చేశారు. తాను విదేశాల్లో ఉన్నప్పుడు మండల అధ్యక్షులను ప్రకటించారని, దీనిపై తనకు కాంగ్రెస్ కార్యకర్తలు ఫోన్ చేశారన్నారు. ఇదే అంశాన్ని తాను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ల దృష్టికి తీసుకువెళ్లాలని, నిర్ణయం తీసుకున్నారు. ప్రకటన ఆపాలని కోరానని చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత మండలం తిరుమలగిరి, తన స్వంత మండలం శాలిగౌరారం తుంగతుర్తిలోనే ఉన్నాయని, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి డీసీసీ అధ్యక్షులు, పార్లమెంట్ అబ్జర్వర్ తో మాట్లాడి సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పానని ఆయన వివరించారు. మండల స్థాయిలో కార్యకర్తలు ఎవరికి ఎక్కువ సపోర్ట్ చేస్తే వారికే అవకాశం ఇద్దామని చెప్పానని ఎంపీ చామల తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలని, తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య మనస్పర్థలు వచ్చినట్టు ప్రచారం జరుగుతోందన్నారు. ఎమ్మెల్యే ముందుల సామేలు కు, ఎంపీగా తనకు ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేదని, అయినా కాంగ్రెస్ కార్యకర్తలు అక్కున చేర్చుకుని మమ్మల్ని గెలిపించారని ఎంపీ చామల చెప్పారు. పదవుల కోసం రోడ్డు ఎక్కి కొట్టుకుంటే ప్రజల్లో చులకన అవుతామని, మనకు పదవులు వచ్చాయని, మన గెలుపు కోసం పని చేసిన క్యాడర్ ను పట్టించుకోవాలని ఆయన తెలిపారు. తాను ఏ వర్గానికి, ఏ కులానికి, ఏ మతానికి వ్యతిరేకం కాదని, అన్యాయం చేయాలనే ఆలోచన లేదన్నారు. ప్రజలు నమ్మకంతో మమ్మల్ని గెలిపించారని, అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తమపైన ఉందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.






