ఆస్పత్రిలో రోగులకు అందని శుద్ధ జలం

by Batti.Sumithra |

రెబ్బెన మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన శుద్ధ జల యంత్రం గత మూడు సంవత్సరాలుగా పనిచేయకపోవడంతో ఆసుపత్రికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఆస్పత్రిలో రోగులకు అందని శుద్ధ జలం
X

దిశ, రెబ్బెన : రెబ్బెన మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన శుద్ధ జల యంత్రం గత మూడు సంవత్సరాలుగా పనిచేయకపోవడంతో ఆసుపత్రికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్వహణ లేకపోవడంతో యంత్రం పూర్తిగా నిరుపయోగంగా మారిందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది సేవలు, మందుల పంపిణీ సక్రమంగా ఉన్నప్పటికీ తాగునీటి వంటి కనీస సౌకర్యం లేకపోవడం బాధాకరమని రోగులు పేర్కొన్నారు.

ప్రతిరోజూ అధిక సంఖ్యలో రోగులు ఆస్పత్రికి వస్తుండటంతో శుద్ధ తాగునీటి అవసరం మరింత పెరిగిందన్నారు. గురువారం దిశ ప్రతినిధి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి శుద్ధ జల యంత్రాన్ని పరిశీలించారు. అనంతరం ఈ విషయాన్ని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ సీతారాం దృష్టికి తీసుకెళ్లగా, యంత్రం గత మూడు సంవత్సరాలుగా పనిచేయడం లేదని తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు పేర్కొంటూ, త్వరలోనే యంత్రానికి మరమ్మతులు చేపట్టి రోగులకు శుద్ధ తాగునీరు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. శుద్ధ జల యంత్రాన్ని వెంటనే మరమ్మతు చేసి రోగులకు అందుబాటులోకి తేవాలని స్థానిక ప్రజాప్రతినిధులు, రోగులు కోరుతున్నారు.

Next Story