మాదకద్రవ్యాలను వినియోగిస్తున్న ఐదుగురు అరెస్ట్

by Taduka Kalyani |

మాదకద్రవ్యాలను వినియోగిస్తున్న ఐదుమందిని అత్తాపూర్ పోలీసులు అరెస్టు చేశారు.

మాదకద్రవ్యాలను వినియోగిస్తున్న ఐదుగురు అరెస్ట్
X

దిశ, రాజేంద్రనగర్ : మాదకద్రవ్యాలను వినియోగిస్తున్న ఐదుమందిని అత్తాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావు తెలిపిన వివరాల ప్రకారం .. అత్తాపూర్ న్యూ జలాల్ బాబా నగర్ లోని ఓ స్క్రాప్ దుకాణంలో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. అక్కడికిe చేరుకున్న పోలీసులు ఎంఎం పహడీకి చెందిన ఆటోడ్రైవర్ సయ్యద్ అబ్దుల్ హుస్సేన్(34), సైఫ్ అలీమీర్జా(21), అహ్మద్ హుస్సేన్(24), షేక్ ఆయూబ్(27), మీర్ షబ్బీర్ అలీ(38) ఎండీఎంఏను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. వారందరిని తనిఖీ చేసి వారి నుంచి 6.6గ్రాముల ఎండీఎంఏ, హైటర్ ఎమ్ ఇంజక్షన్ లు 5, ఆల్ఫాజోలం టాబ్లెట్స్ 5 స్టిప్స్, 1 కత్తి, సెల్ ఫోన్, 16, 930 నగదు ను స్వాధీనం చేసుకున్నారు. అందిరిని అదుపులోకి తీసుకున్నారు. వారికి మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న బాకర్ పరారీలో ఉన్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.

Next Story