సాంకేతిక సేవలను ప్రజలకు చేరవేయాలి : సీపీ అంబర్ కిషోర్ ఝా

by Batti.Sumithra |

పోలీసులు సాంకేతిక సేవలను ప్రజలకు చేరవేసేలా కృషి చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు.

సాంకేతిక సేవలను ప్రజలకు చేరవేయాలి : సీపీ అంబర్ కిషోర్ ఝా
X

దిశ, మంచిర్యాల : పోలీసులు సాంకేతిక సేవలను ప్రజలకు చేరవేసేలా కృషి చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. గురువారం జిల్లాలోని తాండూర్ మండలం మాదారం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసులు స్టేషన్ ఆవరణలో పరేడ్ నిర్వహించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. రికార్డులను పరిశీలించి క్రైమ్ రేట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

రిసెప్షన్ కౌంటర్ వద్ద నమోదయ్యే కేసుల వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ పలు సూచనలు, సలహాలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు స్నేహపూర్వకంగా అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని సూచించారు. ఆధునిక సాంకేతిక సేవలు ప్రజలకు చేరవేసేలా కృషి చేయాలన్నారు. గ్రామాల్లో గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణా, నిల్వలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. కళాశాలలు, పాఠశాలల్లో మత్తు పదార్థాల నిర్మూలన పై విద్యార్థులు, యువతకు అవగాహన కల్పించాలని సూచించారు. సీపీ వెంట మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, తాండూర్ సీఐ దేవయ్య, ఎస్సై సౌజన్య, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.

Next Story