- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఖమ్మం–బోనకల్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు...
రాష్ట్ర ముఖ్యమంత్రి శుక్రవారం ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం మత్కేపల్లి క్రాస్ రోడ్డు వద్ద నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభ నేపథ్యంలో ఖమ్మం– బోనకల్ ప్రధాన రహదారిపై ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.

దిశ చింతకాని:- రాష్ట్ర ముఖ్యమంత్రి శుక్రవారం ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం మత్కేపల్లి క్రాస్ రోడ్డు వద్ద నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభ నేపథ్యంలో ఖమ్మం– బోనకల్ ప్రధాన రహదారిపై ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఖమ్మం జిల్లా చింతకాని మండలం, మత్కేపల్లి క్రాస్ రోడ్, జగన్నాథపురంలో జరిగే రైతు ఆశీర్వాద సభకు వచ్చే రైతులు, ప్రజలు, అధికారులు, మీడియా, తదితర వాహనాలు మినహా ఖమ్మం నుంచి బోనకల్ కు సాధారణ వాహనాల రాకపోకలు నిలిపివేయడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ట్రాఫిక్ రద్దీ ని దృష్టిలో పెట్టుకొని ఉదయం 6:00 గంటల నుండి రాత్రి 12:00 గంటల వరకు ఆంక్షలు అమలులో వుంటాయని, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు వెళ్లాలని సూచించారు.* ఖమ్మం నుంచి వయా పందిళ్లపల్లి, చింతకాని, బోనకల్, ఆంధ్రకు వెళ్లే వాహనాలు నేలకొండపల్లి మీదుగా వెళ్లాలని, అదేవిధంగా బోనకల్లు నుంచి ఖమ్మం వైపు వచ్చే వాహనాలు వైరా మీదుగా రావాలన్నారు. ధాంసలాపురం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు దగ్గర నుంచి బోనకల్ బ్రిడ్జి వరకు సాధారణ వాహనాల రాకపోకలు అనుమతించ బడదన్నారు. హైదరాబాదు నుంచి మీటింగ్ కి వచ్చే విఐపి వాహనాలు కోదాడ, నేలకొండపల్లి, ముదిగొండ లోని వల్లపురం నుంచి మీటింగ్ స్థలం కి త్వరగా చేరుకోవచ్చు.రైతు ఆశీర్వాద సభ కు వచ్చే ప్రజల సౌకర్యార్థం వాహనాల పార్కింగ్ మార్గాలు*
చింతకాని మండలం, జగన్నాధపురం గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పర్యటన నేపథ్యంలో రైతు ఆశీర్వాద సభ కు వచ్చే ప్రజల సౌకర్యార్థం, ట్రాఫిక్ రద్దీ నివారణకు మండలాల వారీగా ప్రత్యేక వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు చేయడమైనదని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ప్రజలు తమకు కేటాయించిన మార్గంలో ప్రయాణించి, సంబంధిత పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే వాహనాలను నిలిపివేయవల సిందిగా విజ్ఞప్తి చేశారు. తమ మండలానికి కేటాయించిన రూట్ ద్వారా మాత్రమే ప్రయాణించాలన్నారు. పోలీసు అధికారులు మరియు ట్రాఫిక్ సిబ్బంది సూచనలను తప్పనిసరిగా పాటించాలి. ప్రధాన రహదారులపై వాహనాలను నిలిపి వేయకుండా సభ విజయవంతానికి సహకరించాలన్నారు.
రూట్ నెం. – 1* (పార్కింగ్ నెం. 1 నుంచి 5 వరకు) క్రింది మండలాల నుంచి వచ్చే ప్రజలు రూట్ నెం. 1 ద్వారా వచ్చి వారికి కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలు నిలిపివేయాలి.
ఖమ్మం (టౌన్ & రూరల్)
కామేపల్లి
నేలకొండపల్లి
ముదిగొండ
కామేపల్లి
సింగరేణి
తిరుమలాయపాలెం.
రూట్ నెం. – 2 (పార్కింగ్ నెం. 7, 8 మరియు 15) క్రింది మండలాల నుంచి వచ్చే ప్రజలు రూట్ నెం. 2 ద్వారా రావాలి.
చింతకాని
వైరా
ఏన్కూరు
దమ్మపేట
కల్లూరు
పెనుబల్లి
సత్తుపల్లి
వేంసూరు
చండ్రుగొండ
రూట్ నెం. – 3 (పార్కింగ్ నెం. 10, 11, 12, 13 మరియు 14)
క్రింది మండలాల నుంచి వచ్చే ప్రజలు రూట్ నెం. 3 ద్వారా రావాలి.
మధిర
ఎర్రుపాలెం
బోనకల్
VIP parking: 9
*ప్రత్యేక పార్కింగ్ వి.వి.ఐ.పి. పార్కింగ్ - నెం. 6: వి.ఐ.పి.లు మరియు ప్రభుత్వ అధికారులు :9






