- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షార్ట్‌సర్క్యూట్‌తో పశువుల పాక దగ్ధం.. రూ. లక్ష మేర నష్టం
by Batti.Sumithra |
బజార్‌హత్నూర్ గ్రామానికి చెందిన రైతు సల్లా ముత్తన్నకు చెందిన పశువుల పాక గురువారం షార్ట్‌సర్క్యూట్ కారణంగా అగ్నికి ఆహుతైంది.

X
దిశ, బజార్‌హత్నూర్ : బజార్‌హత్నూర్ గ్రామానికి చెందిన రైతు సల్లా ముత్తన్నకు చెందిన పశువుల పాక గురువారం షార్ట్‌సర్క్యూట్ కారణంగా అగ్నికి ఆహుతైంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానిక గ్రామస్తులు వెంటనే గుర్తించి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. పాకలో ఉన్న ఆవులను గ్రామస్తులు చాకచక్యంగా బయటకు తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే, పశువుల పాకలో నిల్వ ఉంచిన గడ్డి, వ్యవసాయ పనిముట్లు పూర్తిగా అగ్నికి ఆహుతై బూడిదయ్యాయి. ఈ ఘటనలో తనకు సుమారు రూ. 1 లక్ష మేర నష్టం వాటిల్లిందని రైతు సల్లా ముత్తన్న తెలిపారు. సంబంధిత అధికారులు ఘటన పై స్పందించి నష్టాన్ని అంచనా వేసి, ప్రభుత్వ పరంగా తగిన సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Next Story






