- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలి : కలెక్టర్ హరిత
రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించేలా చూడాలని జిల్లా కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు.

దిశ, ఆసిఫాబాద్ : రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించేలా చూడాలని జిల్లా కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైందని తెలిపారు. ప్రాజెక్టులు, చెరువుల కింద వరి సాగు చేసే రైతులను వరికి బదులుగా పప్పుధాన్యాలు, ఆయిల్ పామ్, ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు దృష్టి సారించేలా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. అలాగే జిల్లాలోని ప్రాజెక్టుల నీటి నిల్వలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు.
అంతకుముందు కెరమెరి మండలం పెద్దపట్నాపూర్ గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల హాజరు పట్టిక, వంటగది, తరగతి గదులతో పాటు పరిసరాలను పరిశీలించారు. డ్రాప్‌అవుట్ విద్యార్థులను గుర్తించి సోమవారంలోగా పాఠశాలలో ఉండేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని, ప్రతి విద్యార్థి అపార్ కార్డు కలిగి ఉండేలా చూడాలన్నారు. పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు పిల్లలకు రుచికరమైన భోజనం అందించాలని, అర్థమయ్యే రీతిలో విద్యా బోధన చేయాలని ఆదేశించారు.






