సమర్థవంతమైన పోలీసింగ్‌కు కృషి చేస్తా : ఎస్‌ఐ తేజస్విని

by Batti.Sumithra |

నడిగూడెం పోలీస్ స్టేషన్ నూతన ప్రొబేషనరీ ఎస్‌ఐగా ఏ. తేజస్విని గురువారం బాధ్యతలు స్వీకరించారు.

సమర్థవంతమైన పోలీసింగ్‌కు కృషి చేస్తా : ఎస్‌ఐ తేజస్విని
X

దిశ, నడిగూడెం : నడిగూడెం పోలీస్ స్టేషన్ నూతన ప్రొబేషనరీ ఎస్‌ఐగా ఏ. తేజస్విని గురువారం బాధ్యతలు స్వీకరించారు. 2024 బ్యాచ్‌కు చెందిన తేజస్విని ఇటీవల వరకు సూర్యాపేట స్పెషల్ బ్రాంచ్‌లో విధులు నిర్వహించారు. ఆమెను ఉన్నతాధికారులు నడిగూడెం పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓగా నియమించారు. నడిగూడెం పోలీస్ స్టేషన్ చరిత్రలో తొలి మహిళా ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టిన అధికారిణిగా ఆమె నిలిచారు. కాగా, ఆమెకు ఇదే తొలి ఫీల్డ్ పోస్టింగ్ కావడం విశేషం. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్‌ఐ తేజస్వినిని పోలీస్ స్టేషన్ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ తన పై నమ్మకం ఉంచి నడిగూడెం పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు అప్పగించిన జిల్లా ఎస్‌పీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరి సమస్యను ఓర్పుతో విని, చట్టపరంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. మండల వ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటును ప్రోత్సహించడంతో పాటు, ఇప్పటికే ఉన్న కెమెరాల సర్వైలెన్స్‌ను మరింత పటిష్ఠం చేస్తామని వెల్లడించారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని, ప్రజల సహకారంతో వాటి వినియోగాన్ని విస్తృతం చేసి సమర్థవంతమైన పోలీసింగ్ అందించేందుకు కృషి చేస్తానన్నారు.

డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగం పై ఉక్కుపాదం మోపుతామని, వాటి నియంత్రణకు కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అలాగే నాటు సారా తయారీ, రవాణా, అమ్మకాలకు మండలంలో ఎలాంటి తావు లేదని, అలాంటి వారిపై కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story