- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికాలో ఏపీ యువతి మృతి కేసులో ట్విస్ట్
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన ప్రసన్న మృతి కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమె మృతితో రూ.1400 కోట్ల స్కామ్ కు లింక్ ఉన్నట్టు తేలింది. షేక్ బజార్ కిసాన్ పరివార్ పేరుతో భూపాల్ నాయక్ మరికొందరు డిపాజిట్లు సేకరించి మోసం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన ప్రసన్న మృతి కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమె మృతితో రూ.1400 కోట్ల స్కామ్ కు లింక్ ఉన్నట్టు తేలింది. షేక్ బజార్ కిసాన్ పరివార్ పేరుతో భూపాల్ నాయక్ మరికొందరు డిపాజిట్లు సేకరించి మోసం చేశారు. అయితే ఈ కంపెనీకి డైరెక్టర్ గా ప్రసన్ననే ఒప్పంద పత్రాల్లో సంతకం చేశారు. ఇప్పటికే భూపాల్ ను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు జరుపుతున్నారు. దీంతో ప్రసన్న మరణంపై కేసు ప్రభావం ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ జిల్లా మూలపాడు గ్రామానికి చెందిన అట్లూరి వసంతరావు, మల్లీశ్వరి దంపతుల కుమార్తె ప్రసన్న ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు.
తండ్రి గ్రామంలోనే వ్యవసాయం చేస్తుండగా తల్లి బ్యాగుల తయారీ యూనిట్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రసన్న అమెరికాలో న్యూయార్క్ లోని పేస్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. వీకెండ్ సెలవు కావడంతో ఫ్రెండ్స్ తో కలిసి దగ్గరలోని గుడికి బయలుదేరారు. కాగా సిగ్నల్ వద్ద కారు ఆగి ఉన్న సమయంలో వీరి కారును వెనుక నుండి వచ్చిన మరో వాహనం బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసన్నతో పాటు మరో అమ్మాయి కూడా అక్కడిక్కడే మరణించింది. అయితే ఇప్పుడు 1400 స్కాం జరిగిన కంపెనీకి డైరెక్టర్ గా సంతకం చేయడం పలు అనుమానాలకు దారి తీస్తోంది.






