ఫైర్ వాటర్ నియో బార్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు..

by Taduka Kalyani |

నానక్‌రాంగూడలోని ఫైర్ వాటర్ నియో బార్ అండ్ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.

ఫైర్ వాటర్ నియో బార్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు..
X

దిశ, శేరిలింగంపల్లి: నానక్‌రాంగూడలోని ఫైర్ వాటర్ నియో బార్ అండ్ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించారు. తనిఖీల్లో పచ్చి పీతలు, ఎముకలు లేని చికెన్ కాళ్లు, రొయ్యలు, చికెన్ వింగ్స్, బేబీ కార్న్ ప్యాకెట్లు తదితర ఆహార పదార్థాలను ఎలాంటి లేబుల్స్ లేకుండా నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. అలాగే గడువు ముగిసిన పుట్టగొడుగుల (మష్రూమ్స్) ప్యాక్‌ను స్వాధీనం చేసుకున్నారు. వంటకు, ఐస్ క్రష్ చేయడానికి ఉపయోగిస్తున్న నీటిని నాణ్యత పరీక్షలకు పంపలేదని తేలింది. ఆహారాన్ని నిర్వహించే సిబ్బంది వైద్య ధ్రువీకరణ పత్రాలు, ప్యాకేజింగ్‌కు సంబంధించిన రికార్డులు కూడా అందుబాటులో లేవని అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా కూరగాయలు, మాంసాహార పదార్థాలను వేర్వేరుగా నిల్వ చేయాల్సి ఉండగా కలిసి నిల్వ చేసినట్లు గుర్తించారు. నిల్వ చేసిన ఆహార పదార్థాలపై పేర్లు, వివరాలు లేకపోవడం, గుడ్లను సరైన విధంగా శుభ్రపరచకుండా నిల్వ చేయడం వంటి లోపాలను కూడా అధికారులు గుర్తించారు. ఈ లోపాలపై రెస్టారెంట్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి, ఆహార భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆదేశించారు.

Next Story