- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బయ్యారం ఇనుపరాయి గుట్టను పరిశీలించిన కల్వకుంట్ల కవిత
బయ్యారం ఇనుపరాయి గుట్టను టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరిశీలించారు.

దిశ, బయ్యారం: పునర్ విభజన చట్టం ప్రకారం బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తామని ఇచ్చిన హామీని అప్పటి ప్రభుత్వాలు నెరవేర్చలేదని, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. గురువారం బయ్యారం ఇనుపరాయి గుట్టను పరిశీలించి విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడుతూ, రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత బయ్యారం ఉక్కును ఆంధ్రకు తరలించకుండా అడ్డుకున్నామన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టకుండా కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కపటనాటకాలు ఆడుతున్నారని ద్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీ, అడ్డదారిలో అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే దాకా తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) పార్టీ పోరుబాట నిర్వహిస్తుందని తెలిఆపారు. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే మహబూబాబాద్ జిల్లా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి రాష్ట్ర నాయకులు పొడుగు శ్రీనాథ్, తదితరులు పాల్గొన్నారు






