- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐటీ కంపెనీల్లో కార్ల అటాచ్‌మెంట్ పేరుతో భారీ మోసం
ఐటీ కంపెనీల్లో కార్ల అటాచ్‌మెంట్ చేస్తామంటూ అద్దె ఆశచూపి భారీ మోసం చేస్తున్న ముఠా కార్యకలాపాలను ఏ.జే. మిల్స్ కాలనీ పోలీసులు గుట్టురట్టు చేశారు.

దిశ, హన్మకొండ టౌన్ : జిల్లాలో ఐటీ కంపెనీల్లో కార్ల అటాచ్‌మెంట్ చేస్తామంటూ అద్దె ఆశచూపి భారీ మోసం చేస్తున్న ముఠా కార్యకలాపాలను ఏ.జే. మిల్స్ కాలనీ పోలీసులు గుట్టురట్టు చేశారు. ఈ ముఠా సభ్యులు వాహన యజమానులతో మాట్లాడి నెలకు రూ.35 వేల అద్దె ఆశ చూపి వాహనాల సేకరణ చేసి వాటిని గుట్టుచప్పుడు కాకుండా ఇతరుల వద్ద తాకట్టు పెట్టి లక్షలకు లక్షలు దండుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా వీరిని పక్క సమాచారంతో తెలంగాణ జంక్షన్ వద్ద వాహన తనిఖీల్లో నిర్వహిస్తున్న క్రమంలో ప్రధాన నిందితుడు శ్యామ్ కుమార్, సోహైల్ అరెస్ట్ చేశారు.
వీరి నుంచి మూడు కార్లు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక, సాంకేతిక ఆధారాల సేకరణపై దర్యాప్తు పోలీసు అధికారుల దృష్టి పెట్టినట్లు మోసపోయిన ఇతర బాధితులను గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిపారు. గతంలోనూ సూత్రధారి శ్యామ్ కుమార్ పై నేర చరిత్ర ఉన్నదని, చెన్నారావుపేట, ఇంటేజార్‌గంజ్ పీఎస్‌లలో పలు కేసులు నమోదై ఉన్నట్లు తెలిపారు. పట్టుబడిన ఇద్దరు నిందితులకు జ్యుడీషియల్ రిమాండ్ పంపారు. పరారీలో ఉన్న మిగతా ముఠా సభ్యుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






